telugu navyamedia
వార్తలు సామాజిక

గాజు పెంకులను మింగేస్తున్న లాయర్..

glass pieces

అత్యంత ప్రమాదకరమైన గాజు పెంకులు తగిలి గాయమైతేనే ఎంతో భయపడుతాం. శరీరంలో గుచ్చుకుపోతే పాయిజన్ అవుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తాం. అలాంటి గాజు ముక్కలను నోట్లో వేసుకుని చిప్స్ లా కరకరా నమిలి మింగుతున్నాడు ఓ లాయర్. గాజు ముక్కలను మింగితే ప్రమాదామని తెలిసి కూడా రాజస్థాన్ కు చెందిన ఓ లాయర్ లాగిస్తున్నారు. రాజస్థాన్ దిందోరికి చెందిన న్యాయవాది దయారాం సాహూకు గాజు ముక్కలు తినే అలవాటు ఉంది.

ప్రస్తుతం దాన్ని మానేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. గాజు ముక్కలను ఓ పల్లెంలో పెట్టుకునే సాహూ, చిప్స్ తరహాలో వాటిని నమిలి కరకరా మింగేస్తారు. గత 40-45 సంవత్సరాలుగా ఇదే తంతు సాగుతోంది. అన్నట్లు ఇలా గాజు ముక్కలు తినడం కారణంగా సాహూకు ఒక్కసారి కూడా అనారోగ్యం పాలు కాకపోవడం విశేషం.

Related posts