telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

31లోగా ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు పూర్తి

ap logo

ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ రెండోదశ అడ్మిషన్లు ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి కాంతిలాల్‌ దండే సోమవారం కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇకపై పొడిగించబోమని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్‌, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌, కో ఆపరేటివ్‌, ఏపీ రెసిడెన్షియల్‌, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, ఏపీ మోడల్‌ జూనియర్‌ కాలేజీలు, కాంపోజిట్‌ డిగ్రీ కాలేజీలలోని జనరల్‌, ఒకేషనల్‌ కోర్సులన్నింటికీ ఈ షెడ్యూల్‌ వర్తిస్తుందని తెలిపారు.

Related posts