telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టేజ్ పై భావోద్వేగానికి లోనైన అల్లు అర్జున్… తండ్రి గురించి మాట్లాడుతూ…!

Allu-Arjun

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ట‌బు, సుశాంత్‌, న‌వ‌దీప్ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. థ‌మ‌న్ సంగీతం అందించారు. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. “అల వైకుంఠ‌పుర‌ము”లో చిత్ర మ్యూజిక‌ల్ కాన్సెర్ట్ సోమవారం సాయంత్రం ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి ట‌బు, సునీల్‌, సుశాంత్‌, త్రివిక్ర‌మ్‌, అల్లు అర‌వింద్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. కార్య‌క్ర‌మం చివ‌ర‌లో స్పీచ్ ఇచ్చిన బ‌న్నీ చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడాడు. ముఖ్యంగా సినిమాని నిర్మించిన అల్లు అర‌వింద్ గురించి మాట్లాడే స‌మ‌యంలో కంట త‌డిపెట్టారు బ‌న్నీ.ఆ స‌మ‌యంలో వేదిక కింద ఉన్న అల్లు అరవింద్ పైకి వెళ్లి కుమారుడిని ఓదార్చారు. దగ్గరకు తీసుకొని వెన్నుతట్టారు.

బ‌న్నీ మాట్లాడుతూ.. “నన్ను లాంచ్ చేసింది మా నాన్నగారు. అప్ప‌టి నుండి ఇప్పటి వరకు నేను 20 సినిమాలు చేశాను. వాటిలో ఏడో ఎనిమిదో ఆయన నిర్మించారు. ఆయనకు ఏనాడూ నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకోలేదు. ఇంట్లో కూడా చెప్పుకోలేదు. నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఇక్కడ చెబుతున్నాను.. థాంక్యూ డాడీ” అంటూనే భావోద్వేగానికి గుర‌య్యారు బ‌న్నీ. ‘‘కొడుకు పుట్టిన తరవాత నాకో విషయం అర్థమైంది. నేను మా నాన్నంత గొప్పోడిని ఎప్పటికీ అవ్వలేను. ఆయనలో సగం కూడా కాలేను. మా నాన్నలో నేను సగం అయితే చాలు అనే ఫీలింగ్ వస్తుంది ఎప్పుడూ నాకు. ఈ ప్రపంచంలో మా నాన్న కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు. ఆయనతో ఈ విషయం చెప్పడానికి నాకు ఎప్పుడూ అవకాశం రాలేదు. డాడీ ఐ లవ్ యూ అని చెప్పడానికి ఇదే నాకు మంచి అవకాశం. నేనెప్పుడూ చెప్పలేదు నీకు.. థాంక్యూ థాంక్యూ’’ అంటూ ఏడుస్తూ చెప్పారు అల్లు అర్జున్. తాను ఫస్ట్ సినిమా ‘ఆర్య’ చేసినప్పుడు సంపాదించిన మొత్తం కోటి రూపాయలని చెప్పారు బన్నీ. అప్పటికి తన వయసు 20 నుంచి 21 సంవత్సరాలు ఉంటుందన్నారు. ‘‘నాకు డబ్బుకు ఎప్పుడూ లోటు లేదు. జేబులోకి సొంత డబ్బు వచ్చిన తరవాత అస్సలు లేదు. నాకు పెళ్లయిన తరవాత మా ఆవిడని ఒకే విషయం అడిగాను. నాకు ఇన్ని కోట్లు ఉన్నా నేను మా నాన్నవాళ్ల ఇంట్లో ఉంటాను నీకు ఓకేనా అని అడిగాను. మా నాన్న అంటే నాకు అంతిష్టం. వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఫాద‌ర్. అర‌వింద్ గారు చాలా డ‌బ్బులు కొట్టేసేవాడ‌ని అనేవారు. ఆయ‌న అలా కాదు అయిదు రూపాయ‌లు అడిగితే ఆరు రూపాయ‌లు ఇస్తారు అని చెప్పా” అంటూ నాన్న‌పై త‌న‌కున్న ప్రేమ చాటుకున్నాడు బ‌న్నీ.

Related posts