చంద్రబాబునాయుడు ఏపీలో టీడీపీ బలోపేతంపై దృష్టి సారించారు. ప్రతి జిల్లాలో క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రతి వారంలో రెండ్రోజుల పాటు పర్యటిస్తారని సమాచారం.
తూర్పుగోదావరి జిల్లా నుంచి సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఈ పర్యటన ప్రారంభిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోనే రెండ్రోజులు చంద్రబాబు మకాం వేస్తారని, టీడీపీ జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారని, నియోజకవర్గాల వారీగా సమీక్షలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం.
జగన్, కేసీఆర్ చొరవను అభినందిస్తున్నా: కేశినేని నాని