telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

59 ఓట్లు సాధించి సర్పంచ్ గా విజయం! 

High polling in Rural Areas in Elections
తెలంగాణలోనే అతి చిన్న గ్రామ పంచాయతీ అయిన చిన్న కొల్వాయిలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి.106 ఓటర్లున్న ఆ గ్రామపంచాయతీ జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలంలో ఉంది. సోమవారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో  59 ఓట్లు సాధించి ఓ అభ్యర్థి సర్పంచ్ పదవికి అర్హత పొందాడు. 
టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి చిక్రం రవీందర్ తన ప్రత్యర్థి చిక్రం బుచ్చి రాములుపై గెలుపొందాడు. పోలైన 92 ఓట్లకు గానూ చిక్రం రవీందర్ 59 ఓట్లు సాధించాడు. ఈ చిన్న గ్రామ పంచాయతీలో ఈ నాలుగు వార్డులున్నాయి. మొత్తం జనాభా 162. ఓటర్లు 106  ఇందులో పురుషులు 50, మహిళలు 56 మంది ఉన్నారు.

Related posts