telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కార్తీ చేసిన పనికి వెల్లువలా ప్రశంసలు

Karthi

తిరునెల్వేలి జిల్లా రాధాపురంలోని శూరావలి కాలువ నమ్ముకుని ఎంతో మంది రైతులు వ్యవసాయం చేస్తుంటారు. కొంతకాలంగా పూడిక పేరుకుపోయి నీటి ప్రవాహం మందగించింది. దీంతో రైతులు అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. ఈ విషయం సోషల్‌మీడియా ద్వారా తెలుసుకున్న కార్తి వెంటనే స్పందించారు. 13 కిలోమీటర్ల మేర కాలువలో పూడిక తీయించారు. 21 రోజుల పాటు సాగిన మరమ్మతుల పని కోసం కార్తి 4లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఆయన సంపాదనతో పోల్చుకుంటే ఆ మొత్తం చిన్నదైనప్పటికీ.. రైతులు, ప్రజల సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించిన కార్తిని అక్కడి ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక సూర్య, కార్తి సినిమాలు చేయడంతో పాటు సమాజ సేవలోనూ పోటీ పడుతున్నారు. తెలుగులోనూ వీరిద్దరికి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో వాళ్ల ప్రతి సినిమా తెలుగులో డబ్‌ చేసి విడుదల చేస్తుంటారు.

Related posts