రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సురేశ్ అనే వ్యక్తి సజీవదహనం చేసినం సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనలో విజయారెడ్డి డ్రైవర్ తో పాటు, సురేశ్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ ఘటన పై విజయారెడ్డిపై సురేశ్ భార్య లత సంచలన వ్యాఖ్యలు చేశారు. లంచం కోసం వేధించడం వల్లే విజయారెడ్డిని తన భర్త సజీవదహనం చేశాడని తెలిపారు. భూమి పట్టా కోసం విజయారెడ్డి లంచం అడిగారని, నెల తర్వాత ఇస్తానని చెప్పినా ఆమె వినలేదని అన్నారు.
ఇల్లు అమ్మి డబ్బులు ఇస్తానని చెప్పినా విజయారెడ్డి అంగీకరించలేదని లత తెలిపారు. భూమి, కోర్టు కేసులతో తన భర్త అప్పులపాలయ్యాడని తెలిపింది. కోర్టు కేసుల కోసం మా అత్త బంగారాన్ని కూడా తాకట్టుపెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా భూమి కోసం మానసిక వేదనకు గురయ్యాడని, భూమి పోతుందనే భయంతో రాత్రి వేళల్లో కూడా ఏడ్చేవాడని చెప్పారు.సొంత ఆస్తిని కూడా అమ్ముకోలేక పోతున్నానని బాధ పడేవాడని ఆమె పేర్కొన్నారు.
స్మృతి ఓటర్లకు కానుకలు ఎర చూపుతున్నారు: ప్రియాంక