telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కశ్మీర్ విభజనపై .. కోర్టులో నేడు వాదనలు..

Supreme Court

నేడు సుప్రీంకోర్టు కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు చేపట్టనున్నది. ఈ అంశంలో మొత్తం 10 పిటిషన్లు దాఖలయ్యాయి. సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా పిటిషన్ వేశారు. కశ్మీరీ నేతల నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇవాళ జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవలే జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 31 నుంచి కొత్త విభజన అమలులోకి రానున్నది.

Related posts