telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విప్ గంగుల కాన్వాయిలో ప్రమాదం..ముగ్గురికి గాయాలు

gangula prabhakar reddy ycp

ఏపీ శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి కాన్వాయిలో ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో మంగళవారం ఉదయం కాన్వాయిలోని ఓ పోలీసు వాహనం ఆళ్లగడ్డ సమీపంలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. కడప విమానాశ్రయానికి వెళ్తున్న గంగుల ప్రబాకర్ రెడ్డి కి బందోబస్తుగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వాహనం టైర్ పగలడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులు చంద్రయ్య, గంగాధరప్ప, బాలరాజులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో చంద్రయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Related posts