telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విగ్రహాల ధ్వంసంలో 17 మంది టీడీపీ, 4 బీజేపీ నేతల హస్తం

ఏపీలో దేవాలయాలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. రామతీర్ధం ఘటనతో ఒక్కసారి గా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు సీరియస్ అయ్యాయి. అయితే తాజాగా ఆలయాలపై దాడుల ఘటనల్లో రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఏపీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతల అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు డీజీపీ సవాంగ్‌. ఏపీలో మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఆలయాలపై దాడుల్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేవారిపై కఠినంగా ఉంటామని పేర్కొన్నారు డీజీపీ సవాంగ్‌. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్చలు తప్పవని హెచ్చరించారు. ఆలయాల దాడులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆలయాలపై దాడుల విషయంలో దుష్ర్పచారం చేస్తున్నారని తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా ఆలయాల వద్ద సీసీ కెమెరాలతో భద్రత పెంచుతున్నామని తెలిపారు. 

Related posts