telugu navyamedia
సినిమా వార్తలు

“బిగ్ బాస్-3” కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్

Bigg-Boss

బిగ్ బాస్ తెలుగు సీజన్ -3 ప్రారంభం కాకముందే వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ బిగ్ బాస్ పై యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా సంచనల కామెంట్స్ చేశారు. “బిగ్‌బాస్-3” ఈ నెల 21 న ప్రారంభం కానుంది. ఈ షోకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై చాలా రోజులుగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో రెండు రోజుల్లో షో స్టార్ట్ అవుతుందనగా లిస్ట్ వచ్చేసింది. తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి. వి6 తీన్మార్ వార్తలు షోతో గుర్తింపు సంపాదించుకున్న తీన్మార్ సావిత్రి, యూ ట్యూబ్ షోలతో పాటు ఫన్ బకెట్, సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ మహేష్ విట్ట, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్ వితికా షెరు, సంచలన ఇంటర్వ్యూలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ జాఫర్, ఉయ్యాలా జంపాలా లాంటి కొన్ని సినిమాల్లోనూ నటించిన పునర్నవి భూపాలం, తెలుగుతో పాటు చాలా భాషల్లో వందల సినిమాల్లో నటించిన సీనియర్ నటి రోహిణి. కొరియోగ్రఫర్‌గా గుర్తింపు సంపాదించుకున్న బాబా భాస్కర్, కిషోర్ తిరుమల సినిమాలతో ఫేమస్ అయిన హిమజ, సీరియల్స్, సినిమాలతో పాటు మోడలింగ్‌లోనూ పేరు తెచ్చుకున్న అలీ రెజా, సీనియర్ నటి హేమ “బిగ్ బాస్-3″లో కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారు.

Related posts