telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నితిన్ కు “నో” చెప్పిన గోవా బ్యూటీ

Ileana

గోవా బ్యూటీ ఇలియానా ఇటీవలే మాస్ మహారాజ రవితేజ “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ బ్యూటీ పలు చిత్రాల్లో నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక విషయానికొస్తే… నితిన్ హీరోగా బాలీవుడ్ చిత్రం ‘అంధాదున్‌’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. హిందీలో ట‌బు చేసిన నెగిటివ్ ట‌చ్ పాత్ర‌ను తెలుగులో ఎవ‌రు చేస్తార‌నే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. టబు, శిల్పాశెట్టి, అన‌సూయ పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డాయి. తాజాగా ఈ లిస్టులో మ‌రో పేరు చేరింది. ఇలియానాను కూడా చిత్ర యూనిట్ సంప్ర‌దించింద‌ట‌. అయితే గోవా బ్యూటీ మాత్రం మారు ఆలోచ‌న లేకుండా నో చెప్పేసింద‌ని టాక్‌. మ‌రి ఈ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Related posts