telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రొమాంటిక్ గా “కృష్ణ అండ్ హిజ్ లీల” టీజర్

Krishna and his Leela

సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా రానా దగ్గుబాటి సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాధ్, శీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘క్షణం’ ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ‘కృష్ణ ఫస్ట్ లవ్’ అనే టైటిల్‌తో తాజాగా ఈ చిత్ర మొదటి లవ్ టీజర్‌ను విడుదల చేశారు. కృష్ణ ఫస్ట్ లవ్‌ సత్యగా శ్రద్ధా శ్రీనాధ్ ఈ చిత్రంలో నటించారు. ఆమెకు సంబంధించిన సీన్స్‌తోనే ఈ టీజర్‌ను వదిలారు.టీజర్ లో లిప్ లాక్‌లతో పాటు మంచి డైలాగ్, రొమాంటిక్ సీన్స్‌తో టీజర్‌ను కట్ చేశారు. శ్రద్ధా శ్రీనాధ్ కూడా ఈ టీజర్‌లో చాలా చక్కగా కనిపించింది. త్వరలో ఓటీటీ ద్వారా ఈ చిత్రం రిలీజ్ కానుందని తెలుస్తుంది.

Related posts