telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీవారిని ద‌ర్శించుకున్న పెళ్లి సందD టీమ్‌..

శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా శ్రీలీలా హీరోయిన్‌గా ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గౌరీ రోణంకి ద‌ర్శ‌కత్వంలో వస్తున్న సినిమా పెళ్లి సందD. ఈ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో చూస్తున్న సినిమా రేపు విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో తిరుముల‌ శ్రీ వారిని పెళ్లి సందD టీమ్ ఇవాళ దర్శించు కుంది ..పెళ్లి సందD హీరో రోషన్‌, హీరోయిన్‌ శ్రీలీలాతో పాటు మూవీ టీం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు(గురువారం) ఉదయం వీఐపీ దర్శనం ద్వారా చిత్రం బృందం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు పెళ్లి సందD హీరోహీరోయిన్‌ను, చిత్ర బృందాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు.

ఈ సందరర్భంగా ఈ సినిమా హీరో రోషన్‌ మాట్లాడుతూ….రేపు సినిమా విడుద‌ల‌వుతోన్న నేప‌థ్యంలో శ్రీ‌వారి ఆశీర్వాదం కోసం వ‌చ్చామ‌ని , తిరుమల శ్రీ వారిని దర్శించు కోవడం చాలా సంతోషం గా ఉందన్నారు.

సినిమా హీరోయిన్ శ్రీలేఖ మాట్లాడుతూ.. సినిమా బృందం మొత్తం శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చింద‌ని, పెళ్లి సందD మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌ టైనర్ మూవీ అని..‌. కుటుంబ సభ్యులందరు చూడదగిన పెళ్లిసందడి అని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ లు పెట్టుకుని.. థియేటర్లలో మాత్ర మే సినిమా చూడాలని ఆమె కోరారు.

Related posts