telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

నిషేధాన్ని ఏడు సంవత్సరాలకు తగ్గించాలని బీసీసీఐని కోరుతున్న క్రికెటర్

Ankit

2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణానికి పాల్పడినందుకు జీవితకాల నిషేధం అనుభవిస్తున్నాడు అంకీత్ చవాన్. అయితే తన నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించాలని బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ)కు రాసిన లేఖలో కోరారు. 2013లో, బీసీసీఐ క్రమశిక్షణా కమిటీ ఫిక్సింగ్ కు పాల్పడిన ముగ్గురు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లను కనుగొంది. అందులో చవాన్ తో పాటుగా భారత పేసర్ ఎస్ శ్రీశాంత్, మరియు అజిత్ చండిలాను స్పాట్ ఫిక్సింగ్ కారణంగా జీవిత నిషేధం విధించింది. అయితే మళ్ళీ శ్రీశాంత్ నిషేధాన్ని ఏడు సంవత్సరాలకు తగ్గించారు. ఇప్పుడు పోటీ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి శ్రీశాంత్‌కు అవకాశాలు వస్తుండటంతో, 34 ఏళ్ల చవాన్ కూడా బీసీసీఐకి, అతని రాష్ట్ర సంస్థ ఎంసిఎకు కూడా తొందరలో తాను ఆడటానికి వీలుగా నిషేధాన్ని ఏడు సంవత్సరాలకు తగ్గించాలని లేఖలో వేడుకున్నాడు. ఇంకా శ్రీశాంత్ నిషేధాన్ని పునః పరిశీలించినట్లయితే, నా నిషేధాన్ని కూడా మళ్ళీ పరిశీలించండి” అని చవన్ కోరారు.

Related posts