telugu navyamedia
సినిమా వార్తలు

సిద్దార్థ్‌ శుక్లా పోస్ట్‌మార్టం పూర్తి ..

బాలీవుడ్‌ నటుడు, హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13 విజేత, చిన్నారి పెళ్లికూతురు ఫేం సిద్దార్థ్‌ శుక్లా పోస్ట్‌మార్టం పూర్తైంది. అయితే సిద్దార్థ్‌ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని వైద్యులు వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, కెమికల్‌ అనాలిసిస్‌ కోసం అంతర్గత అవయవాల నుంచి సేకరించిన నమూనాలు పంపించారని, ఆ తర్వాతే మరణానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి.

What happened to Sidharth Shukla the night before his death? - Television News

సిద్ధార్థ్ హఠాన్మరణంతో బాలీవుడ్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన 40 ఏళ్ళకే యువనటుడు గుండెపోటుతో మృతి చెందడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. తీవ్రమైన గుండెపోటు రావడంతో గురువారం ఉదయం 10.30 నిమిషాలకు సిద్ధార్థ్ తుదిశ్వాస విడిచారు. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉల్లాసంగా కనిపించే సిద్ధార్థ్ లేడన్న వార్త అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సిద్ధార్థ్ ఘటన జరగడానికి ముందురోజు సైతం వర్కవుట్స్‌ చేసినట్లు సమాచారం.

Sidharth shukla dies actor sidharth shukla postmortem report is completed his last rites will take place friday

రాత్రి 8గంటలకు ఇంటికి చేరుకున్న సిద్ధార్థ్..పది గంటల సమయంలో జాగింగ్‌తో పాటు కొన్ని వర్కవుట్స్‌ చేశాడని తెలుస్తుంది. అనంతరం నిద్రపోయే ముందు అతను కొన్ని మెడిసిన్స్‌​ తీసుకున్నాడని, అయితే తెల్లవారుజామున 3గంటలకు ఛాతిలో నొప్పి రావడంతో తన తల్లికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమె స్వయంగా నీళ్లు తాగించిందని, అనంతరం నిద్రపోయిన సిద్ధార్థ్ మళ్లీ మేల్కోలేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

Sidharth Shukla was brought dead to Cooper hospital, no injuries on body, say doctors - Television News

ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సిద్ధార్థ్‌ ప్రతిరోజు క్రమం తప్పకుండా దాదాపు 3గంటల పాటు వ్యాయామం చేసేవాడట. అయితే వర్కవుట్‌ సమయాన్ని కాస్త కుదించమని ఇటీవలె వైద్యులు సలహా ఇచ్చినట్లు సమాచారం. తీవ్రమైన వర్కవుట్స్‌ కూడా ప్రమాదమేనని వైద్యులు అంటున్నారు. ఆర్థిక జీవనశైలితో పాటు ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే గుండెపోటు తలెత్తడం వంటివి జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. శారీరక దాడృత్యంతో పాటు మాససిక ప్రశాంతత కూడా ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు.

Sidharth Shukla complained about chest pain at around 3am on Thursday, says a source - Times of India

కాగా.. సిద్దార్థ్‌ అకాల మృతిని కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఫిట్‌గా, ఉల్లాసంగా కనిపించే వ్యక్తి ఇలా ఆకస్మికంగా చనిపోవడంతో బీటౌన్‌ ఇండస్ట్రీ దిగ్బ్రాంతిలో మునిగిపోయింది.

Related posts