telugu navyamedia
సినిమా వార్తలు

‘హరిహర వీరమల్లు’ నుంచి పవర్‌ గ్లాన్స్‌ వచ్చేసింది..

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ తాజాగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హిస్టారికల్‌ చిత్రంగా ‘హరి హర వీరమల్లు’ తెరకెక్కుతోంది.

నేడు(శుక్రవారం)పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్‌ గ్లాన్స్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేశారు మేకర్స్.

Hari Hara Veera Mallu Power Glance Video: Pawan Kalyan gives goosebumps  with his action & top notch BGM | PINKVILLA

కాసేపటి క్రితం డైరెక్టర్ క్రిష్ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో “మెడల్ని వంచి, కథల్ని మార్చి, కొలిక్కి తెచ్చే పనెట్టుకొని.. తొడకొట్టాడో తెలుగోడు” అంటూ తెలుగోడు అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోగా.. విలన్స్‏ను వేటాడుతూ పవర్ ఫుల్ లుక్ లో కనిపించారు.

మల్లయోధులతో ఆయన పోరాటం చేస్తున్న దృశ్యాలకు తగ్గట్టుగా ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరుతో సాగే ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి.

Hari Hara Veera Mallu teaser: Pawan Kalyan promises a visual treat |  Entertainment News,The Indian Express

హిస్టారికల్‌ చిత్రంగా ‘హరి హర వీరమల్లు’ సిద్ధమవుతోంది. మొఘలాయిలు, కుతుబ్‌ షాహీల శకం నేపథ్యంలో సాగే కథ ఇది. చరిత్రకెక్కిన ఒక బందిపోటు వీరోచిత గాథగా దీన్ని రూపొందిస్తున్నారు.

 పాన్‌ ఇండియా స్థాయిలో దీన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే సగం సినిమా షూట్‌ పూర్తైంది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఎ.ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాదిలో వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Related posts