telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జన్‌ ఆందోళన్‌లో అందరం భాగమవుదాం : వెంకటేష్

venkatesh

కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదు. అయితే మొహానికి మాస్క్ ధరించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, భౌతికదురం పాటించడం తదితర జాగ్రత్తలకు జనాలు బాగానే అలవాటు పడ్డారు. అయితే ఇప్పడు చలికాలం కారణంగా జలుబు తదితర సీజనల్ ఫ్లూలు, పండుగలు ఉండడంతో ఒకే దగ్గర జనాలు గుమిగూడడం వంటి విషయాల వల్ల కరోనా పెరిగే అవకాశం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ‘జన్‌ ఆందోళన్‌’ పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ తన సోషల్‌ మీడియా అకౌంట్స్ల్‌ ద్వారా గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ విక్టరీ వెంకటేష్‌ ఓ వీడియోని తాజాగా పోస్ట్ చేశారు. ”ఇండియాని సేఫ్‌గా ఉంచేందుకు నా దగ్గర ఉన్న మంత్రాలివే.. మాస్క్‌ను ధరించడం, చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, భౌతికదూరం పాటించడం. కరోనాకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ చేపట్టిన జన్‌ ఆందోళన్‌లో అందరం భాగమవుదాం” అని తెలుపుతూ నాలాగే అందరూ కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో భాగం అవుతారని కోరుకుంటున్నాను” అని వెంకటేష్‌ తెలిపారు.

Related posts