telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దేడ్ ధిమాఖ్ అయితే చాలు… అజ్ఞానమే ఆనందకరమైనది : పూరీ

Puri

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా ‘దేడ్ ధిమాఖ్’ అంటే ఏమిటనే విషయంపై తమ మ్యూజింగ్స్ లో మాట్లాడారు. “రెండ్రోజులుంటాం.. పోతాం. ఈ చిన్న లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎక్కువ ఆలోచించొద్దు. ఆ మూమెంట్ ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే చాలు. మనం కోతులం. కుదురుగా ఉండము. అన్నీ కెలికి చూస్తే గానీ మనశ్శాంతి ఉండదు. ఈ కెలకడం వల్ల ఉపయోగం లేదు. సమాధానాల కోసం ప్రయత్నించడం మానేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆన్సర్స్ ఎప్పుడూ దొరకవు. దేవుడు ఏంటి, ఆత్మ ఏంటి, ఈ జీవితానికి అర్థం ఏమిటి ఇవన్నీ మనకెందుకు? నువ్వో ఓ పాట పాడితే, మనస్ఫూర్తిగా నవ్వితే ఈ జీవితం అర్థవంతమైనట్టే. దూరి దూరి ఎక్కడో లోపల చూసాం.. మనకు న్యూట్రాన్ కనిపించింది. దాని తర్వాత కూడా ఏదో ఉండే ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మనకు తెలిసింది ఇది. మనిషికి ఎలా ఉంటుందంటే.. భూమి మొత్తం తవ్వేసి లోపల ఏముందో చూడాలని, గాలిలో ఎగిరి యూనివర్స్ ఎండ్ చూడాలని అనిపిస్తుంటుంది. ఈ కోతిపనులు మనకెందుకు. ఎండ్ ఎప్పుడూ దొరకదు. ఈ లైఫ్ ఎంజాయ్ చేయడానికి మనకు నాలెడ్జ్ అవసరం లేదు. మనం దేడ్ ధిమాఖ్ అయితే చాలు. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న అందరూ ఆ ఇన్వెస్టిగేషన్ మధ్యలోనే పోతారు. ఇంతవరకూ ఎవ్వడూ ఏ కేసూ పట్టుకోలేదు. భగవద్గీత మొత్తం చదివితే చివరి పేజీలో ఒక విషయం రాశారు.. `అజ్ఞానమే ఆనందకరమైనది` అని. ఇదే `దేడ్ ధిమాక్`. తక్కువ ఆలోచించి ఎక్కువ ఫీలయ్యేవాళ్లే జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు” అని చెప్పిన పూరి జగన్నాథ్ చివర్లో ‘మావా ఎక్ పెగ్‌లా.. అరె మావా ఎక్ పెగ్‌లా..’ అంటూ ముగించారు.

Related posts