telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి… అధికారిక ప్రకటన

800

ప్రపంచంలోనే మేటి స్పిన్నర్‌గా 800 వికెట్లు తీసిన యోధుడిగా క్రికెట్ చరిత్రలో హిస్టరీ క్రియేట్ చేసిన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌కి రంగం సిద్ధమైంది. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. క్రికెటర్ మురళీధరన్‌గా కనిపించబోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 800 వికెట్లు తీసి వండర్ ఆఫ్ క్రికెట్‌ కీర్తించబడ్డ మురళీధరన్ సేవలకు గుర్తింపుగా ఈ సినిమాకి ‘800’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ చిత్రబృందం వెల్లడించింది. మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నాడు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా కోసం మురళీధరన్ బౌలింగ్‌ను విజయ్ ప్రాక్టీస్ చేయడం కూడా మొదలు పెట్టాడు. ఈ సినిమాని అన్ని భాషలలో రిలీజ్ చేయనున్నారు.

ఇక మురళీధరన్ క్రికెట్ విషయానికి వచ్చేసరికి 1972, ఏప్రిల్ 17న శ్రీలంకలోని క్యాండీలో తమిళ హిందూ కుటుంబంలో.. సిన్నసామి ముత్తయ్య, లక్ష్మీ దంపతులకు జన్మించారు మురళీధరన్. టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో ఎనమిది వందల వికెట్లు తీసి ఘనతని సాధించి రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ మురళీధరన్ కావడం విశేషం.. అటు వన్డేలో 534 వికెట్లు తీశాడు. చివరగా మురళీధరన్ 2011 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్ ఆడి క్రికెట్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు. కాగా విదేశీ క్రికెటర్ పైన బయోపిక్ తెరకెక్కడం అనేది ఇదే తోలిసారి కావడం విశేషం. ఈ బయోపిక్ కోసం అటు అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Related posts