telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య సినిమాలో కన్నడ స్టార్‌ పునీత్‌ ..!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్ ‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసి లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. ఈ భారీ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఓ గెస్ట్‌ రోల్‌ చేస్తాడని తెలుస్తోంది. ఇంటర్వెల్‌ సమయంలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రిలో పునీత్‌ కన్పిస్తాడట. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related posts