telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం

Tollywood

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని సినిమాల విడుదలలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఈ లాక్‌డౌన్ కారణంగా చిన్న సినిమా నిర్మాతలు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో వారు ఓటీటీలో వారి సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నారు. దీంతో వారంతా తమ చిత్రాలకు సెన్సార్ చేయాలని కోరుతున్నారు. అయితే ఈ విషయంపై హైదరాబాద్ సెన్సార్ బోర్డు స్పందించింది. కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఊరటనిచ్చేందుకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సెన్సార్ బోర్డ్) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ సంస్థ చైర్మన్ దేశంలో ఉన్న ముఖ్యమైన నగరాల్లోని ప్రాంతీయ సెన్సార్ కార్యాలయాల అధికారులతో చర్చించారు. ఈ మేరకు ప్రాథమికంగా రెండు అంశాలపై నిర్మాతలకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ అధికారి వి బాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ వల్ల నిర్మాతలకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత త్వరగా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలని నిర్ణయించాం. సినిమా సెన్సార్‌కు నిర్మాతలు వ్యక్తిగతంగా హాజరు కాకున్నా ఆన్‌లైన్‌లో సందప్రదించి, ఈ-మెయిల్‌లో సర్టిఫికెట్లు జారీ చేస్తాం. అలాగే నిర్మాత కోరుకున్న చోట సెన్సార్‌కు ఏర్పాట్లు చేసి, సినిమాను హార్డ్ డిస్క్, క్యూబ్‌లలో తీసుకొచ్చినా సెన్సార్ చేస్తామన్నారు పేర్కొన్నారు బాలకష్ణ. దీంతో చిన్న సినిమాల నిర్మాతలకు కాస్త ఊరట లభించినట్లైంది.

Related posts