telugu navyamedia
సినిమా వార్తలు

సినిమా ఇండస్ట్రీపై సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Sameera-Reddy

జై చిరంజీవ, అశోక్ వంటి తెలుగు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సమీరా రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, సినిమా ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో మహిళలకు అవకాశాలను ఎరగా చూపిస్తూ వాడుకోవాలనుకుంటారని, చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంటారని, మహిళ అంటే కేవలం గ్లామర్ వస్తువుగానే చూస్తారని, తాను కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నానని సంచలన విషయాలను వెల్లడించారు. అంతేకాదు పరిశ్రమలో పురుషులను, స్త్రీలను సమానంగా చూడరని, రెమ్యునరేషన్ విషయంలోనే కాకుండా గౌరవం విషయంలో కూడా అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయని, మహిళల విషయంలో పరిశ్రమ ఆలోచన మారాలని, ఎంత త్వరగా మార్పు వస్తే అంత మంచిదని, మీటూ లాంటి ఉద్యమాల కారణంగా ఇప్పుడిప్పుడే మార్పు మొదలైందని, అయితే ఇంకా అడుగులు చాలా మెల్లగా పడుతున్నాయని, త్వరగా మార్పు వస్తే మంచిదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గర్భవతి అయిన సమీరా రెడ్డి త్వరలోనే తన రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలో సమీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Related posts