telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేడు వైఎస్ఆర్ వర్ధంతి: ఇడుపులపాయలో నివాళులర్పించిన వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు

*క‌డ‌ప జిల్లాలో రెండో రోజు ప‌ర్య‌ట‌న‌
*ఈ రోజు ఉద‌యం వైఎస్ఆర్ కి ఇడుపులపాయలోని జగన్ నివాళి
*సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్ నివాళులర్పించారు.

సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి సీఎం జగన్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

2004 సెప్టెంబర్ 2వ తేదిన అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణీస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురై వైఎస్ఆర్ మరణించిన విషయం తెలిసిందే.

వైఎస్ఆర్ భౌతికంగా దూరమైనా ఎప్పటికీ ఆయన చిరునవ్వు నిలిచే ఉన్నాయని జగన్ గుర్తు చేశారు.ప్రజల అవసరాలేూ పాలనకు ప్రధానాంశం కావాలని వైఎస్ఆర్ చాటి చెప్పారని సీఎం జగన్ గుర్తు చేశారు.వైఎస్ఆర్ స్పూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం జగన్ చెప్పారు.. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ వైఎస్ఆర్ ను గుర్తు చేసుకున్నారు.

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్సార్‌కు నివాళి అనంతరం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష చేపట్టారు. విడతల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాల పై స్థానిక నాయకులు, అధికారులతో సీఎం సమీక్ష జరుపుతున్నారు.

Related posts