telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

రానున్న రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు

rains in telugu states today

రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో సాధారణం కంటే అధిక వర్షాలు పడుతామని అధికారులు వెల్లడించారు. తీర ప్రాంతం ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి బలపడనున్నది. అల్పపీడనం, నైరుతి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లోనూ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Related posts