telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పాలకులకు విజన్ ఉండాలి కాని విధ్వేషం కాదు ..పేద వారికి న్యాయం చేసిన నేత ఎన్టీఆర్‌

*టీడీపీ విస్తృత స్థాయి స‌మావేశం..
*పేద వారికి న్యాయం చేసిన నేత ఎన్టీఆర్‌..
*గురుకుల పాఠ‌శాల‌ను పెట్టింది ఎన్టీఆరే..

పాలకులకు విజన్ ఉండాలి కాని విధ్వేషం కాదని  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు . చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. నేటి పాలకల్లో విద్వేషాలు పెరిగి దాడులకు తెగబడుతున్నారనిఅన్నారు .విశాఖపట్నంలో డాక్టర్ సుబ్రహ్మణ్యంతో ఈ విద్వేష దాడులు మొదలయ్యాయని తెలిపారు.

అలాగే అనంతపురం జిల్లాలో ఒక కానిస్టేబుల్ తనకు న్యాయం చేయాలని కోరితే ఉద్యోగం ఊడబెరికారన్నారు. విభజన జరగడం బాధాకరమని, అయితే ఆ సమస్యల నుంచి బయటపడి అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం నిలిపేసిందన్నారు

అడ్మిస్ట్రేటివి రిఫార్మ్స్‌ను రాష్ట్రంలో తీసుకువచ్చింది ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చింది కూడా ఎన్టీఆర్ అన్నారు.

ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురుకుల పాఠ‌శాల‌ను పెట్టింది ఎన్టీఆరే అని గుర్తు చేశారు.

ఎన్టీఆర్‌ అందించిన రెండు రూపాయలకు కిలో బియ్యం తో సంక్షేమ పథకాల యుగం ప్రారంభమయిందన్నారు. తెలుగుదేశం పాలనలోనే సంక్షేమం ఎక్కువగా జరిగిందన్నారు.

తన విజన్ తో హైదరాబాద్ లో ఐటీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తనను గుర్తు పెట్టకోక పోయినా చేసిన పనులు సంతృప్తినిస్తాయని అన్నారు.

Related posts