telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

సినిమా హాల్ లో అగ్ని ప్రమాదం..ఫర్నీచర్ ధ్వంసం

fire accident in mojanjahi market hyd

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని మలికిపురంలో పద్మజ థియేటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడటంతో ఫర్నీచర్ ధ్వంసమైంది. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ప్రమాద సమయంలో థియేటర్ ఖాళీగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts