అమరావతిపై ప్రభుత్వానికి ఎలాంటి కక్షసాధింపు లేదని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది రాజకీయ నిరుద్యోగులు అమరావతి అంటే ప్రేమ ఉన్నట్టు, తమకు లేనట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతి అభివృద్ధి చేయాలంటే 30 సంవత్సరాలు పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు జూమ్ రాజకీయాలతో ఆర్గనైజ్ చేశారని విమర్శించారు. లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు.
అమరావతిపై సబ్బంహరి, పురందేశ్వరి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అమరావతి కోసం ముసలి కన్నీరు కాస్తున్నారని వ్యాఖ్యానించారు. సబ్బంహరికి రాజకీయ భిక్ష పెట్టింది విశాఖ ప్రజలు, రాజశేఖర్ రెడ్డి అని గుర్తుచేశారు. సబ్బం హరి జగన్ మీద ద్వేషంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.