telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎం జ‌గ‌న్ కొత్త టీమ్‌లో.. రెండో ఛాన్స్ దక్కించుకున్న10 మంది పాత మంత్రులు వీరే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ తన మంత్రివర్గంపై కసరత్తును దాదాపుగా పూర్తి చేశారు .
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ తన టీంను ఎంపిక చేసుకున్నారు. దాదాపుగా మంత్రివర్గ జాబితా సిద్ధమైంది.  

పాత మంత్రులలో దాదాపు 10 మందికి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 15 మందికి క్యాబినెట్ లో చోటు దక్కనుంది.

అయితే పాత మంత్రుల్లో రెండో ఛాన్స్ ఎవరికి ఇస్తారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.ఇప్పటిదాకా ఉన్న కేబినెట్లో అగ్రవర్ణాలకు చెందిన వారు 44 శాతం ఉండగా… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే మెజారిటీ సంఖ్యలో 56 శాతంగా ఉన్నారు.

తాజా కేబినెట్ కూర్పులో బీసీ -ఎస్సీ వర్గాలకు మరింత ప్రాధాన్యత పెరగనుంది. అందులో భాగంగా.. రెడ్డి – కాపు వర్గాలకు ఒక్కో సీటు తగ్గించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

పాతమంత్రుల్లో కొన‌సాగించేవారిలో అనుభవం, సామాజిక సమీకరణ, జిల్లా ప్రాతినిధ్యం ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్, కొడాలి నాని, గుమ్మనూరు జయరాం, సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, పేర్ని నాని లు పేర్లు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం.

గవర్నర్‌కు కొత్త మంత్రుల జాబితాను నేడు పంపనున్నారు. ఆ జాబితాకు గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తరువాత.. సీఎం జగనే స్వయంగా ఆయా మంత్రులకు ఫోన్ చేసి.. రేపటి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలి  ఫోన్లు చేసి సమాచారం ఇవ్వనున్నారు

రేపు 11వ తేదీ ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.అయితే ఇప్పటికే తమకు పదవులు వస్తాయనే నమ్మకంతో ఉన్నవారంతా ఇప్పటికే విజయవాడ చేరుకున్నట్టు తెలుస్తోంది.

Related posts