telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైసీపీలోకి చేరికలు.. జగన్ .. ఊ అంటే.. సిద్ధంగా టీడీపీ నేతలు..

voilance jummalamadugu ycp tdp

ఏపీలో స్థానిక ఎన్నికలు వచ్చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో పార్టీ మారితే కొంతైనా ప్రయోజనం ఉండకపోతుందా అనుకునే టీడీపీ నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. అయితే అందుకు జగన్ అనుమతే తరువాయి అన్నట్టు సమాచారం. ఆయన సరే అంటే, భారీగా చేరికలు ఉండనున్నాయి. స్థానిక ఎన్నికలు వచ్చేలోగా, వైసీపీలో చేరాలని ఎంతో మంది నేతలు ప్లాన్ చేసుకుంటుంటే, వారికి జగన్ నుంచి అనుమతులు మాత్రం రావడం లేదు. తమ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాకా ఆగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు చెబుతుండటంతో ఏం చేయాలో అర్థంగాని స్థితిలో వలస నేతలు ఉన్నారు. ఇప్పటికే వైసీపీలో కొనసాగుతున్న స్థానిక నేతలతో టచ్ లో ఉన్న తెలుగుదేశం లోకల్ క్యాడర్, వలస వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, వారిని ఆహ్వానించేందుకు మాత్రం వైసీపీ సిద్ధంగా లేదు.

మరో రెండు రోజుల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక సంఘాల పదవీ కాలం ముగియనుండటంతో వేలాది మంది రాజకీయ నిరుద్యోగులుగా మారనున్నారు. ఈ సమయంలో వైసీపీలో చేరితేనే తమకు లబ్ది కలుగుతుందన్నది టీడీపీ నేతల అంచనా. ఆ పార్టీలో చేరేందుకు పైరవీలు సాగిస్తూ, ముఖ్య నేతలతో మాట్లాడుతూ, ఎప్పుడంటే అప్పుడు ఫిరాయించేందుకు సిద్ధమని అంటున్నా, వైసీపీ మాత్రం ఇంకా సై అనడం లేదు. ఎన్నికల సమయంలో తటస్థంగా ఉన్న నేతలు సైతం ఇప్పుడు వైసీపీ వైపే చూస్తున్నారని తెలుస్తోంది. జగన్ వీళ్లకి అవకాశం ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

Related posts