telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సుప్రీంకోర్టు తీర్పు కేంద్రానికి చెంపపెట్టు: సాధినేని యామిని

TDP Yamini fire to Ys Jagan

సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ ను తిరిగి నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ మహిళా నేత సాదినేని యామిని స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, సుప్రీం కోర్ట్ తీర్పు కేంద్రానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.

అగ్రవర్ణాల పేదలకు10 శాతం రిజర్వేషన్లు ప్రజల్ని మభ్యపెట్టడానికే అని యామిని విమర్శించారు. ఎన్నికల ముందు రిజర్వేషన్లు తీసుకురావడం.. ఓట్ల జిమ్మిక్కుగా ఆమె అభివర్ణించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు రిజర్వేషన్లు అంశాన్ని తీసుకువచ్చారు. బీజేపీ నేతలు చంద్రబాబు పై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తాం అని చెప్పారు.

Related posts