అమరావతి రైతులు, ఐకాస నేతలు రాజధాని పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేసేందుకు దిల్లీకి వెళ్లారు. దాదాపు 45 రోజులకు పైగా రాజధాని అంశంపై పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో అమరావతి ఐకాస నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు. రైతుల పోరాటానికి తగిన న్యాయం చేయాలని కోరుతామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోంది. రాజధానిలో ఇప్పటి వరకు 30 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. కేంద్రం నుంచి కూడా చనిపోయిన రైతులకు సంతాపం తెలపలేదు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఒకే రాజధాని-ఒకే రాష్ట్రం మా నినాదం. మా లక్ష్యం కూడా అదే. రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జీఎన్‌రావు కమిటీ సహా ఏ కమిటీ వల్ల ప్రయోజనం లేదని రాజధాని రైతులు మీడియా ఎదుట వాపోయారు.
ప్రజావేదిక కూల్చివేత కక్షసాధింపు చర్యే: బుద్దా వెంకన్న