telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మంత్రివర్గ కూర్పు కసరత్తు పూర్తి..నేడు కొత్త మంత్రుల జాబితా ఖ‌రారు

ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్ కొత్త కేబినెట్ రెడీ అయ్యింది. కొత్త పాత క‌ల‌యిక‌లో మంత్రి వర్గ సభ్యుల ఎంపిక పూర్తి చేశారంటున్నారు.

అయితే 10 మంది పాతవారినే కొనసాగించ‌నున్నారు. కొత్త వారిలో 15 మందికే ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, అనుభవం, జిల్లా అవసరమే ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా కేబినెట్ కూర్పులో బీసీ -ఎస్సీ వర్గాలకు మరింత ప్రాధాన్యత పెరగనుంది. ఇద్దరు గిరిజనులు, ఇద్దరు మైనారిటీలలతో పాటు ఆరుగురు ఎస్సీలకు క్యాబినెట్‌లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.

మంత్రులు రాజీనామాలు ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్‌కు కార్యాలయానికి చేరాయి.ఈ రోజు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించనున్నారు. ఇందుకు సంబంధించి వెంటనే గెజిట్‌ విడుదల కానుంది. కొత్త మంత్రులు ఎవరనేది ఈరోజు సాయంత్రానికి గవర్నర్‌కు జాబితా చేరే అవకాశం ఉంది. రేపు ఉదయం 11.31 గంటలకు కేబినెట్ కొలువు తీరనుంది.

ఈ నేప‌థ్యంలో  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని సీఎం పిలిపించుకుని చర్చించారు. ఈ రోజు   మధ్యాహ్యం 12 గంటలకు మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ను కలవనున్నారు. 

మంత్రివ‌ర్గ కసరత్తులో భాగంగా కొత్త మంత్రుల పేర్లతో పాటు, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే విషయంపైనా సీఎం ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయిన వారికి గౌరవం తగ్గకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపైనా చ‌ర్చించ‌నున్నారు

ఈ రోజు సాయంత్రానికి తుది జాబితాను రూపొందించి .. ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి ఫోన్లు వెళ్తాయి. కొత్త మంత్రులతో సీఎం జగన్‌ నేరుగా మాట్లాడి శుభాకాంక్షలు చెప్పనున్నారని సీఎంవో వర్గాల సమాచారం.

 

Related posts