telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎం జగన్ టీమ్ 2.0 ఫైనల్ లిస్ట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ప్ర‌మాణ‌స్వీకారం ఏప్రిల్‌11న జ‌ర‌గ‌నుంది. కొత్త మంత్రులతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఏపీ రాజ‌భ‌వ‌న్‌కు 24మంది మంత్రులు రాజీనామాలు చేరుకున్నాయి. ఈ రాత్రికే గ‌వ‌ర్న‌ర్ రాజీనామాలు ఆమోదించ‌నున్నారు

2024 ఎన్నికల్లో వైపీసీ గెలుపే లక్ష్యంగా మొత్తం మంత్రులందరితో మూకుమ్మడి రాజీనామాలు చేయించారు. వీరిలో కొందరు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తొలుత ఐదుగురు మంత్రులు కొనసాగతారని ప్రచారం జరిగింది. తాజాగా 10 నుంచి 15 మంది వరకు కంటిన్యూ అవుతారని టాక్ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో కొంద‌రు ఆశావహుల ప‌ద‌వి మాకే వ‌స్తుంద‌ని ఎదురుచూస్తున్నారు.

అలాగే కొత్త మంత్రులపై సీఎం జగన్ కసరత్తు తుది దశకు చేరింది. కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకునేవారితో పాటు కొనసాగించే వారి పేర్లను కూడా గవర్నర్ వద్దకు పంపనుంది.

ప్రస్తుతం మంత్రులుగా ఉన్న బొత్స , పెద్దిరెడ్డి , కొడాలి నాని , బుగ్గన , పేర్ని నాని , అనిల్ , బాలినేని, కన్నబాబు లను అనుభవం ప్రకారం కొనసాగించే అవకాశం ఉంది.

అలాగే సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రులు జయరామ్, వేణుగోపాల్ , అప్పలరాజు, సురేష్ , అంజాద్ బాషా, శంకర్ నారాయణ , తానేటి వనిత ను కొత్త కేబినెట్‌లోకి తీసుకుంటారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

కొత్తగా కేబినెట్ లో చేరేది వీరే..!

ధర్మాన ప్రసాదరావు – శ్రీకాకుళం – బీసీ వెలమ
రాజన్నదొర- సాలూరు- ఎస్టీ
భాగ్యలక్ష్మి- పాడేరు- ఎస్టీ
గుడివాడ అమర్నాధ్- అనకాపల్లి- కాపు
దాడిశెట్టి రాజా – తుని-కాపు
చిట్టిబాబు- పి.గన్నవరం- ఎస్సీ ( మాల)
కారుమూరి నాగేశ్వరరావు- తణుకు- బీసీ
గ్రంథి శ్రీనివాస్‌- బీమవరం-కాపు
జోగి రమేశ్‌- పెడన – బీసీ
విడదల రజని- చిలకలూరిపేట- బీసీ
మేరుగ నాగార్జున- వేమూరు- ఎస్సీ ( మాల)
కాకాని గోవర్థన్‌రెడ్డి- సర్వేపల్లి – రెడ్డి
జొన్నలగడ్డ పద్మావతి- శింగనమల- ఎస్సీ ( మాల)
శిల్పా చక్రపాణిరెడ్డి- శ్రీశైలం- రెడ్డి
కోరుముట్ల శ్రీనివాస్‌- రైల్వేకోడూర్‌- ఎస్సీ ( మాల)
రక్షణ నిధి- తిరుపూరు- ఎస్సీ మాదిగ

Related posts