telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అజ్జాతవాసి నిమ్మగడ్డ రమేష్‌, జూమ్‌ బాబుతో ఏపీకి నష్టమే…

kodali nani ycp

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. ఈ ఎన్నికలపై ఇప్పటికే ఏపీ సీఎస్ నీలం సాహ్ని.. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్​కు లేఖ రాశారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని సీఎస్‌ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. ఎన్నికల నిర్వహణపై నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని సూచించారు. అయితే… సీఎస్‌ లేఖకు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ బదులు ఇచ్చారు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా సీఎస్‌కు సమాధానం పంపారు. సీఎస్ లేఖ ఎన్నికల కమిషన్‌ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరచడమేనని చట్టవిరుద్దమని అన్నారు.
అయితే… తాజాగా కొడాలి నాని నిమ్మగడ్డపై ఫైర్‌ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మరోసారి పేర్కొన్నారు కొడాలి నాని. చంద్రబాబు లేఖలకు స్పందిస్తూ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్తలు, ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. హైదరాబాద్‌లో కూర్చునే అజ్జాతవాసి నిమ్మగడ్డ రమేష్‌, జూమ్‌ బాబులు ఇద్దరు కలిసి ప్రజలకు నష్టం కలిగించేలా ఎన్నికలు నిర్వహిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

Related posts