telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ ఈఎన్సీకి కేఆర్‌ఎంబీ లేఖ…

ఆంధ్రప్రదేశ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను నిలిపివేయాలని కోరుతూ ఏపీఈఎన్సీకి కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించిన విధంగా డీపీఆర్‌లు ఇవ్వాలని సూచించింది. డీపీఆర్‌లు ఇచ్చేంత వరకు ఎలాంటి పనులు చేయొద్దంటూ ఏపీఈఎన్సీకి కేఆర్ఎంబీ ఆదేశించింది. నిజానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ కొద్ది రోజుల క్రితమే లేఖ రాశారు. నిర్మాణంలో ఉన్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. అక్టోబర్‌ 6 నాటి అపెక్స్‌ కౌన్సిల్‌ ఆదేశాలు అమలు చేయాలని సూచించారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. దీనిపై స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి… ఏపీ, తెలంగాణ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరని చెప్పింది. అక్టోబర్‌ 6 నాటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డుల పరిధులు, అధికారాలను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలనీ నిర్ణయించారు..ప్రాజెక్టుల “డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్” ( డి.పి.ఆర్) లు సమర్పించేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించారని ఆరోజునే కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.

Related posts