telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

చంద్రయాన్-2 : .. ఆ దూరం 400 మీటర్లే.. 2కిమీ కాదు ..

kendriya vidyalaya students to isro on

చంద్రయాన్‌-2లో విక్రమ్ ల్యాండర్, ఇస్రో మధ్య సంబంధాలు చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో తెగిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే 400 మీటర్ల దూరంలో ఉండగానే సిగ్నల్స్ కట్ అయిందని, తమ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల పొరపాటు జరిగిందని ఇస్రో తెలిపింది.

విక్రమ్ ల్యాండర్ కాల పరిమితి 14 రోజులే కావడంతో ఇస్రో చేతిలో మారో 9 రోజులే ఉన్నాయి. దీంతో ల్యాండర్ కమ్యూనికేషన్ కోసం ఇస్రో తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఇస్రో తృప్తి కోసమైనా అది దక్కితే, తరువాతి ప్రయోగం రెట్టించిన ఉత్సాహంతో చేపడతారు. లేకపోతే ఎక్కడో కొంచం అసంతృప్తి ఉంటుంది. లేనిపక్షంలో ఈ ప్రయోగం వలన క్రాష్ లాండింగ్ జరిగే అవకాశాలను తగ్గించే కోణాన్ని కూడా పరిశీలించుకుని, ప్రయోగాన్ని మరింత విజయవంతం చేసుకునే పాఠం నేర్చుకోవచ్చు. మరో 9 రోజులు మన శాస్త్రవేత్తల కోసం వేచిచూద్దాం!

Related posts