telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

జనవరి 3,4 తేదీల్లో కోదండరాం నిరాహార దీక్ష…

Kodandaram

టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం జనవరి 3,4 తేదీల్లో 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. రాష్ట్రంలో ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి చెల్లించాలి… ఎల్ ఆర్ ఎస్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి అని తెలిపిన ఆయన ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలి … కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. తర్వాత జిల్లాల వారీగా పోరాటం చేస్తాం. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. రెండేళ్ల నుంచి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ లేదు. యువత నిరుద్యోగ సమస్య తో కొట్టుమిట్టాడుతున్నారు. నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ బృతి చెల్లించాలి. ప్రైవేట్ విద్య సంస్థల ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదు. బడ్జెట్ పాఠశాలల్లో బోధన రుసుములు అందించాలి. రైతులు అనేక విధాలుగా నష్ట పోయారు. బలవంతంగా ప్రజల నుంచి భూములు తీసుకుని కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు భూములు ఇస్తున్నారు అని ప్రశ్నించిన ఆయన కేంద్ర వ్యవసాయ చట్టానికి విరుద్ధంగ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఆర్థిక పునరుద్ధరణ కోసం ఒక్క ప్యాకేజీ కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. చూడాలి మరి ఈయన నిరాహార దీక్ష ఫలిస్తుందా… లేదా..?

Related posts