telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎం జగన్‌‌కు అభిమాని బిగ్‌ సర్‌ప్రైజ్..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల నెల్లూరు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నారు. 418 కేజీల వెండి కాళ్ల పట్టీలు, మెట్టెలతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటాన్ని తయారు చేయించారు. చూడటానికి అద్భుతంగా ఉంది.

దానికి సంబంధించిన వీడియో, లోగోలను ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో నుడా ఛైర్మన్‌తో కలిసి ఆవిష్కరించారు. 35 అడుగుల ఎత్తు.. 20 అడుగుల వెడల్పుతో ఈ చిత్రపటాన్ని రూపొందించారు. తమిళనాడులోని కోయంబత్తూరులో దీన్ని రూపొందించారు.

కేరళకు చెందిన ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ఆధ్వర్యంలో మొత్తం 8 మంది దీనికోసం 12 గంటలపాటు శ్రమించారు. ఈ వీడియా, ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

కాగా..తమకు దైవ సమానమైన సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా, ఇలా వెండి పట్టీలతో సీఎం చిత్రపట్టాన్ని రూపొందించామని తెలిపారు ద్వారాకా నాధ్‌. 12గంటల పాటు ఎంతో శ్రమించి, సీఎం జగన్‌ నమూనాను తయారు చేయడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి అనిల్‌ కుమార్ తెలిపారు.

Related posts