telugu navyamedia
సినిమా వార్తలు

కొత్త అసోసియేషన్‌పై ప్రకాశ్‌ రాజ్‌ స్పందన

కొత్త అసోసియేషన్‌ మొదలు పెట్టే ఆలోచన ఏదీ లేదని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన ప్యానెల్‌ నుంచి గెలిచిన 11మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘ఆల్‌ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (ఆత్మ)’ పేరుతో కొత్త అసోసియేషన్‌ ఏర్పాటు చేస్తారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.

“ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ అని ఏదో మొదలు పెడతామని వార్తలు వచ్చాయి. అలాంటి ఆలోచన లేదు. ‘మా’ అసోసియేషన్‌ సమస్యలపై స్పందించటానికే నేను వచ్చాను. అవసరమైతే ‘మా’లో ఉన్న వాళ్లతో కలిసి పనిచేస్తాం కానీ, మేమేదో 10మందిని తీసుకుని కొత్త అసోసియేషన్‌ పెట్టే ఆలోచన లేదు.

రెండు వేర్వేరు ప్యానెల్స్‌లో గెలిచిన వాళ్లు పనిచేసే వాతావరణం లేదనే ఉద్దేశంతోనే మా ప్యానెల్‌ సభ్యులు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అది వాళ్ల నిర్ణయమే. ఓడినా, గెలిచినా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. ప్రతినెలా విష్ణు ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అడుగుతా. మీరు చేసే పనిలో మేం అడ్డుపడం. కానీ, పనిచేయకపోతే తప్పకుండా ప్రశ్నిస్తాం” అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.

 

Related posts