telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఈట‌లకు హరీశ్‌ రావు సవాల్

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక తేదీ తరుముకొస్తున్న నేపథ్యం లో ఈ నేతల మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. హుజురా బాద్ నియోజ‌క‌వర్గం పెంచిక‌ల్ పేట గ్రామంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.

గ్యాస్ ధ‌ర పెరుగుద‌ల‌కు కార‌ణం 291 రూపాయ‌ల రాష్ట్ర పన్నుఅని చెబుతున్న ఈట‌ల రాజేంద‌ర్ దాన్ని నిరూపిస్తారా? ఈ విష‌యంలో జ‌మ్మికుంట గాంధీ బొమ్మ ద‌గ్గ‌ర‌కైనా, హుజూరాబాద్ అంబేద్క‌ర్ బొమ్మ ద‌గ్గ‌ర‌కు అయినా చ‌ర్చ‌కు సిద్ధంగా ఉన్నామ‌ని రాష్ట్ర ఆర్థిక‌శాఖ‌మంత్రి త‌న్నీరు హ‌రీశ్‌రావు ఈట‌ల‌కు స‌వాలు విసిరారు. గ్యాస్ ధ‌ర త‌గ్గాలంటే రాష్ట్రం ట్యాక్స్ త‌గ్గించుకోవాల‌ని ఈట‌ల అంటున్నార‌ని, కానీ రాష్ట్రప్రభుత్వం తరపున ఒక్క రూపాయి ట్యాక్స్ వేయడంలేదని స్ప‌ష్టం చేశారు. ఉన్నది జీఎస్టీ పన్ను 5 శాతం మాత్ర‌మేన‌ని అదీ కూడా కేంద్రం విధించిందేన‌ని, అదీ 47 రూపాయలు మాత్రమే అని స్ప‌ష్టం చేశారు. గ్రామీణ వైద్యుల‌తో త‌న‌కు 20 ఏండ్ల ఉద్య‌మ అనుబంధం ఉంద‌ని, పోరాటాల్లో, ఉప ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేశాన‌ని, చాలా జిల్లాల్లో మీతో క‌లిసి ద‌గ్గ‌ర‌గా ప‌నిచేసిన సాన్నిహిత్యం ఉంద‌ని హరీశ్‌రావు అన్నారు.

 

Related posts