telugu navyamedia
సినిమా వార్తలు

‘వదిలించుకోవడానికి నేను హోలీకి అంటిన రంగునా.. హోల్‌సేల్ అల్లుడిని’..

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పెళ్ళి సందD .. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వపర్యవేక్షణలో  గౌరీ రోనంకి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘పెళ్ళిసందడి’ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతుంది.  సినిమాలో రోషన్ కు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది.

New 'Pelli SandaD' song to be unveiled on THIS day

ఇక తాజాగా ఈ సినిమా తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు,  ఈ ట్రైలర్‌ ను స్వయంగా ప్రిన్స్‌  మహేష్ బాబు చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ను విడుదల చూశారు. పెళ్లి సందడి ట్రైలర్‌ను విడుదల చేసిన మహేష్ చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..

ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ కథాంశంగా తెరకెక్కుతున్నట్లు ఈ ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి.. వాళ్లిద్ద‌రూ ఓ పెళ్లిలో క‌లుసుకోవ‌డం, ప్రేమించుకోవ‌డం, ఆ త‌ర‌వాత విడిపోవ‌డం – మ‌ధ్య‌లో ఫైట్లు, అంద‌మైన పాట‌లు, రొమాంటిక్ సీన్లూ… వెర‌సి మొత్తంగా రాఘ‌వేంద్ర‌రావు సినిమానే చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చింది. రోష‌న్ కి మాస్ ఇమేజ్ తీసుకురావాల‌న్న తాప‌త్ర‌య‌మో ఏమో.. ఫైటింగుల‌కు బాగానే స్కోప్ ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్‌ లో రాఘవేద్రరావు కనిపించి…. అందరిని కనివిందు చేశాడు. కీర‌వాణి సంగీతం ఈ చిత్రానికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. 

Pelli Sandadi : సూపర్ స్టార్ వదిలిన పెళ్లి సందడి ట్రైలర్.. ఇక థియేటర్స్‌లో సందడే సందడి...

ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, పోసాని కృష్మ మురళి, వెన్నెల కిషోర్ రాజీవ్ కనకాల అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. వీరితోపాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు..

పాతికేళ్ళ క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా బ్లాక్ బాస్టర్  హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇప్పట్లో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి.

Related posts