telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమల చరిత్రలో తొలిసారి.. స్వామివారి ద‌ర్శ‌నాలు లేక 45 రోజులు

tirumala temple

తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా శ్రీవారి దర్శనాలు లేక నేటికీ 45 రోజులు అవుతోంది. కరోనా వైరస్ కార‌ణంగా మార్చి నెల మూడో వారం నుంచి దర్శనాలను నిలిపివేశారు. కేంద్ర ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా తిరుమలలోనూ లాక్ డౌన్ ను టీటీడీ పొడిగిస్తూ వచ్చింది. ఈ క్ర‌మంలోనే శ్రీవారి దర్శనంతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో మరో రెండు వారాల పాటు దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్టు టీటీడీ ఇప్ప‌ట‌కే ప్ర‌క‌టించింది.

లాక్‌డౌన్‌ పొడిగిస్తూ కేంద్రం ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక మే 17 త‌ర్వాత‌ లాక్ డౌన్ ను ఎత్తివేస్తే, పరిమిత సంఖ్యలో అయినా భక్తులకు దర్శనాలను కల్పించాలని టీటీడీ భావిస్తున్న‌ది. అందుకు అవలంభించాల్సిన విధి విధానాలపై కసరత్తు ప్రారంభించింది. కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోయేదాకా భక్తుల సంఖ్యపై పరిమితి విధించే అవకాశముంది.

Related posts