telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సునీల్ ‘కనబడుటలేదు’ రిలీజ్ డేట్ ఫిక్స్…

సునీల్ ఇటీవల తన గేర్ మార్చిన సంగతి తెలిసిందే. కాని వరుస పరాజయాలు హీరోగా కాస్త గ్యాప్ తీసుకునేందుకు దోహదం చేశాయి. అయితే అన్ని ప్లాప్‌లు అందుకున్న హీరోగా సునీల్ పరిశ్రమలో ఉన్నా.. అతడికి ఇంకా అవకాశాలు వస్తున్నాయి. మర్యాదరామన్న లాంటి భారీ హిట్‌కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఇప్పుడు సరికొత్త కథతో డిటెక్టివ్‌గా మన ముందుకు రానున్నాడు. కనబడుటలేదు అన్న పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో సునీల్ డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు. ఏప్రిల్ 16 న ఈ సినిమా మన ముందుకు రానున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేసారు. అయితే ఈ పోస్టర్‌లో దేనికోసం వెతుకుతున్నట్లు సునీల్ కనిపిస్తున్నాడు. అది కూడా చీకటి గదిలో టార్చిలైట్ పట్టుకొని డిటెక్టివ్‌ పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదలవుతున్న అదే రోజున నాగచైతన్య, సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’ మూవీ కూడా జనం ముందుకు రాబోతోంది. దాంతో సునీల్ కు గట్టి పోటీనే ఉంది. కాబట్టి ఈ సినిమాతోనైనా సునీల్ హీరోగా ఆకట్టుకుంటాడా అనేది చూడాలి మరి .

Related posts