telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

2020 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక… బెస్ట్ యాక్టర్ అతనే…!

Joker

ప్రపంచ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించే అస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ వేడుక మొదలైపోయింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డాల్బై థియేటర్‌లో ఈ వేడుకను నిర్వహించారు. గత రెండేళ్లుగా ఆస్కార్ వేడుకను హోస్ట్ లేకుండా నామినేషన్స్, విన్నర్స్ ఎనౌన్స్‌మెంట్స్‌తో నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా అలాగే నిర్వహించారు. ఈసారి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ ఎవరెవరికి దక్కిందో చూద్దాం. బెస్ట్ యాక్టర్ అవార్డు ప్రముఖ హాలీవుడ్ నటుడు జోక్విన్ ఫినిక్స్‌కు దక్కింది. 2019లో వచ్చిన ‘జోకర్’ సినిమాలో జోక్విన్ అద్భుతమైన నటన కనబరిచారు. సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఆస్కార్ విన్నర్స్ వీరే :
ఉత్తమ చిత్రం- పారసైట్
ఉత్తమ నటుడు- జోక్విన్ ఫినిక్స్ (జోకర్)
ఉత్తమ నటి- రెనే జెల్‌వెగర్ (జూడీ)
ఉత్తమ దర్శకుడు- బాంగ్ జూన్ హో (పారసైట్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్- పారసైట్ (సౌత్ కొరియా)
ఉత్తమ సహాయ నటి- లౌరా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ సహాయ నటుడు- బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్)

Related posts