telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరో నుండి విలన్ గా సూపర్ స్టార్ టర్న్…. 4 సినిమాలకు గ్రీన్ సిగ్నల్

Vijay-Sethupathi

తమిళ ప్రేక్షకులు మ‌క్క‌ల్ సెల్వ‌న్‌గా పిలుచుకునే విజ‌య్ సేతుప‌తి ఇటీవ‌ల‌ తెలుగు, త‌మిళ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న హీరోగా న‌టించిన 96 చిత్రం భారీ విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప‌లు భాష‌ల‌లో రీమేక్‌లు చేస్తున్నారు. హీరో నుండి విల‌న్ వైపు యూట‌ర్న్ తీసుకున్న విజ‌య్ సేతుప‌తి.. విజ‌య్ 64వ చిత్రంలో విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానుంది. ఇక క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ క్రేజీ ప్రాజెక్ట్ భార‌తీయుడు 2లోను విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించేందుకు ముందుకొచ్చాడ‌ట‌. 2020 దీవాళీకి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఉప్పెన అనే సినిమా తెర‌కెక్కుతుండ‌గా, ఇందులోను విజ‌య్ సేతుపతి న‌టిస్తున్నాడు. ఇందులో ఆయ‌న పాత్ర నెగెటివ్‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెర‌కెక్క‌నున్న చిత్రంలోను విజ‌య్ సేతుప‌తి మెయిన్ విల‌న్‌గా న‌టిస్తార‌ట‌. మొత్తానికి విజ‌య్ సేతుప‌తి ఎంపిక చేసుకుంటున్న పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌కి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి. స్టార్ హీరో అయి ఉండి కూడా నెగెటివ్ పాత్ర‌ల‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపుతుండ‌డం వృత్తిపై ఆయ‌న‌కి ఉన్న నిబ‌ద్ధ‌త‌ని తెలియ‌జేస్తుంది.

Related posts