telugu navyamedia
సినిమా వార్తలు

సింగర్ కేకే హఠాన్మరణంపై చిరంజీవి దిగ్భ్రాంతి..

భారత సినీ సంగీత ప్రపంచంలో మరో గొంతు మూగబోయింది. ప్ర‌ముఖ సింగ‌ర్ కేకే ఆలియాస్ కృష్ణకుమార్ కున్నత్ కోల్‌కతాలో హఠాన్మరణం చెందారు .

తెలుగు సహా హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో తన పాటలతో ఎంతో మంది శ్రోతలను ఉర్రూత లూగించిన కేకే మృతిపై రాజ‌కీయ‌, సినీ ప్రముఖులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.

తాజాగా కేకే మృతిపై   మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. అంతేకాదు ఇంద్ర సినిమాలోని ‘దాయి దాయి దామ్మ’ పాటను ఈ సందర్భంగా గుర్తుకు చేసుకున్నారు.

Related posts