నటుడు గోపిచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ హీరో, హీరోయిన్స్‌గా, తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమాకి ‘చాణక్య’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, టైటిల్ లోగో రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. గోపిచంద్ 26వ సినిమా ఇది. ఈ షూటింగ్ మధ్యలో గోపిచంద్ యాక్సిడెంట్ వలన షూటింగ్ కాస్తంత ఆలస్యం అయింది. ‘పంతం’ సినిమా తర్వాత మరోసారి ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ కంప్లీటైంది. మిగిలిన పాటలను విదేశాల్లో చిత్రీకరించే ప్లాన్‌లో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అంతేకాదు చాణక్యుడిలా దేశాన్ని ఏ రకంగా రక్షించాడనేదే ఈ సినిమా స్టోరీలా ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కవ భాగం భారత్, పాకిస్థాన్ బార్డర్‌లో షూట్ చేసారు. ఈ సినిమాను అనిల్ సుంకర,అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నారు.
previous post
next post