telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా అభిమాని మృతి… బన్నీ సినిమా అప్డేట్ వాయిదా

Noor

మెగా అభిమాని నూర్ భాయ్ ఈ రోజు ఉద‌యం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతితో మెగా హీరోల‌తో పాటు అభిమానులు షాక్‌లో ఉన్నారు. అల్లు అర్జున్ న‌టిస్తున్న అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్ర టీజ‌ర్‌కి సంబంధించిన అప్‌డేట్ ఈ రోజు ఇస్తామ‌ని చిత్ర బృందం ముందు రోజు ప్ర‌క‌టించగా, నూర్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో వాయిదా వేశారు. మా ఫ్యామిలీ వ్యక్తిలాంటి నూర్ చనిపోయిన టైంలో చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వ‌డం క‌రెక్ట్ కాద‌నిపించింది. స‌రైన స‌మ‌యం చూసుకోని అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్ర టీజ‌ర్ వివ‌రాలు వెల్ల‌డిస్తాం అని గీతా ఆర్ట్స్ త‌మ ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న అల‌.. వైకుంఠ‌పురుమ‌లో చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తుండ‌గా, చిత్రాన్ని జ‌నవరి 12న విడుదల చేయ‌నున్నారు.

Related posts