telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంతతో విజయ్ దేవరకొండ… “సామ్ జామ్”లో ఫస్ట్ గెస్ట్

Samantha

హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ ‘ఆహా’. సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా మాధ్యమం.. మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమమే ‘సామ్‌జామ్‌’. ఈ టాక్‌షోకు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇది కేవలం టాక్‌ షో మాత్రమే కాదు.. సమాజంలోని సమస్య గురించి ప్రశ్నించడం. టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయడం వంటి డిఫరెంట్‌ స్టైల్‌ను ఇందులో మనం చూడొచ్చు. దేశంలో టాప్‌ ప్రోగ్రామ్స్‌ అయిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి, కాఫీ విత్‌ కరణ్‌ వటి వాటిని డిజైన్‌ చేసిన టాప్ టీమ్‌ ‘సామ్‌జామ్‌’ను డిజైన్‌ చేశారు. నవంబర్‌ 13 నుండి ప్రతి వారం ప్రసారం కానున్న ఈ షోలో పాల్గొనబోయే మొదటి గెస్టుగా టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను ఎంచుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు చూస్తుంటే ఈ షో మొదటి ఎపిసోడ్‌లో అక్కినేని కోడలు సమంతతో విజయ్ దేవరకొండ మ్యాజిక్ చేయబోతున్నారని స్పష్టమవుతోంది. సామ్ జామ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన విజయ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో సిల్వర్ కలర్ సూట్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ మూవీ చేస్తున్నారు విజయ్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడ్డ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది.

Related posts